15/08/2026
దివంగత రియల్‌స్టార్ డా. శ్రీహరి జయంతి సందర్భంగా మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా నుంచి పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకమైన పోతురాజు ఆహార్యంలో మేఘాంశ్ కనిపించగా.. ఆయన వెనుక అదే గెటప్‌లో రియల్‌స్టార్ శ్రీహరి కనిపించడం అభిమానులను ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోంది. 🙏🔥
లెల్లా రోహిత్ దర్శకత్వంలో, లెల్లా రాహుల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే గ్రాండ్ టైటిల్ గ్లింప్స్ రివీలింగ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 🎬