Computers & Education

Computers & Education Computing is any goal-oriented activity requiring, benefiting from, or creating computers. For examp

A computer is a machine that manipulates data according to a set of instructions called a computer program. The program has an executable form that the computer can use directly to execute the instructions. The same program in its human-readable source code form, enables a programmer to study and develop the algorithm. Because the instructions can be carried out in different types of computers, a

single set of source instructions converts to machine instructions according to the central processing unit type. The execution process carries out the instructions in a computer program. Instructions express the computations performed by the computer. They trigger sequences of simple actions on the executing machine. Those actions produce effects according to the semantics of the instructions.

16/11/2017

Smartphone తయారీ కంపెనీలకి ఇండియా అతి కీలకమైన మార్కెట్. ఎలాగైనా ఇండియాలో వినియోగదారులు వాడే smartphoneలలో అధిక శాతం వాటాని దక్కించుకోగలిగితే అగ్రస్థానంలో ఉన్నట్లే.

సుదీర్ఘకాలంగా ఇండియాలో Samsung అగ్రస్థానాన్ని అనుభవిస్తూ వచ్చింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ IDC వెలువరించిన ఫలితాల ప్రకారం మొట్టమొదటిసారిగా Samsung చైనాకి చెందిన Xiaomiతో అగ్ర స్థానాన్ని పంచుకోవలసిన దుస్థితి దాపురించింది. దేశంలో వినియోగంలో ఉన్న smartphoneలలో ఈ రెండు సంస్థలూ తలో 23.5 శాతం వాటాని దక్కించుకున్నాయి.

Lenovo 9 శాతం వాటానీ, Vivo 8.5 శాతం, Oppo 7.5 వాటానీ దక్కించుకున్నాయి. అయితే Xiaomi ఇంతగా ఎదగడానికి తక్కువ ధరలో మెరుగైన స్పెసిఫికేషన్లు ఉన్న phoneలను అందించడం ఓ కారణం అయితే Samsung ప్రదర్శించిన తలపొగరు మరో కారణం. వ్యాపార సంస్థలకు తల పొగరు ఉండకూడదు. కానీ Samsung క్రమేపీ ఇండియాలో తగ్గుతున్న అమ్మకాలను తట్టుకోలేక తల పొగరు ప్రదర్శించింది. తత్ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తోంది.

ముఖ్యంగా Xiaomi సంస్థ Big C, Sangeeta వంటి రిటైల్ షాపుల ద్వారా కూడా అమ్మకాలు ప్రారంభించిన తరుణంలో Xiaomi phoneలను విక్రయించే షాపుల వాళ్లకి Samsung phoneలను సప్లై చెయ్యడం నిలిపివేస్తామని Samsung సంస్థ బెదిరించింది. ఇది అమ్మకాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇప్పటికైనా Samsung తాను చేస్తున్న తప్పులు గ్రహించి సరిచేసుకోపోతే తన budget phoneల మార్కెట్‌ని పూర్తిగా Xiaomiకి సమర్పించుకోక తప్పదు.

16/11/2017

ఇది వాడితే అశ్లీల సైట్లకి బదులు భక్తి పాటలు వస్తాయి!

పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగంతో పాటు అందర్నీ కలవరపెడుతున్న ప్రధానమైన సమస్య అశ్లీల వెబ్సైట్లను యువతరం విపరీతంగా బ్రౌజ్ చేయడం.

అశ్లీల వెబ్సైట్లను అడ్డుకోవడానికి DNS filtering చేసే అనేక ప్రత్యేకమైన పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ తాజాగా బెనారస్ హిందూ యూనివర్సిటీ న్యూరాలజిస్ట్ ల బృందం ఒక వినూత్నమైన appని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Har Har Mahadev పేరుతో పిలువబడే ఈ యాప్ అశ్లీల వెబ్ సైట్స్ ని, హింసాత్మకమైన సమాచారాన్ని, అసభ్య సమాచారంతో కూడిన వెబ్సైట్లను ఓపెన్ చేయకుండా నిలువరిస్తోంది. ఈ appని phoneలో download చేసి రిజిస్టర్ చేసుకోగానే.. ఇకపై ఆ స్మార్ట్ ఫోన్ ని వాడెవారు ఎవరైనా అశ్లీలమైన సైట్లను ఓపెన్ చేయటానికి ప్రయత్నిస్తే అవి ఓపెన్ కాకుండా భక్తి పాటలు వినిపించబడటాయి.

ఆరునెలల సమయం శ్రమించి ఈ అప్లికేషన్ను డిజైన్ చేయడం జరిగింది. దీనితో ప్రస్తుతానికి 3800 వివిధ అశ్లీల వెబ్సైట్లను బ్లాక్ చేసే ఏర్పాటు చేయబడింది. మున్ముందు మరిన్ని సైట్లను దీనిలో చేర్చే అవకాశముంది. అలాగే ఎవరైనా అశ్లీల సైట్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే ప్రస్తుతానికి హిందూ మతానికి సంబంధించిన పాటలు మాత్రమే వస్తున్నాయి. మున్ముందు ఇతర మతాలకు సంబంధించిన పాటలు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేయబడుతుంది.

02/11/2017
29/06/2017

జవాబులు... డబ్బులు

గూగుల్‌ చకచకా ప్రశ్నలు అడుగుతుంటే... మీ ఠకీ ఠకీమని జవాబులు చెప్పాలి... అప్పుడు గూగుల్‌ మీకు డబ్బులు ఇస్తుంది. ఇదేదో బాగుందే అంటారా? అయితే ఇంకెందుకు ఆలస్యం Google Opinion Reward ఆప్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఆప్‌ అడిగే ప్రాథమిక సమాచారం అందించి లాగిన్‌ అవ్వండి. ఆ తర్వాత ఆప్‌ వరుస ప్రశ్నలు అడుగుతుంది. వాటికి ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఆప్షన్లు ఉంటాయి. వాటిలోంచి సరైన సమాధానం ఎంచుకోవాలి. తొలి సర్వేకు గూగుల్‌ డబ్బులేమీ చెల్లించదు. రెండో సర్వే నుంచి ఒక్కోదానికి రూ.32.50 చెల్లిస్తుంది.

24/06/2017

శబ్దాల డబ్బా

రైలు వేగంగా వెళ్తున్న శబ్దం కావాలా, కారు హారన్‌ శబ్దం వింటారా, ఏనుగు ఘీంకారం ఎలా ఉంటుందో మీ సిస్టమ్‌లోనే వింటారా? వాటి కోసం గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో వెతకనక్కర్లేదు. రకరకాల శబ్దాలను ఒకే దగ్గర అందించే సెర్చ్‌ ఇంజిన్‌FindSounds లోకి వెళ్తే సరి. అందులో వివిధ ఫార్మేట్లలో శబ్దాలుంటాయి. మీరు చేయాల్సిందల్లా సెర్చ్‌ బార్‌లో మీకు కావల్సిన శబ్దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం ఇవ్వడమే. రిజల్యూషన్‌, శాంపిల్‌ రేట్‌, ఫార్మేట్‌ అంటూ శోధన ఫలితాలను వర్గీకరించుకోవచ్చు.

06/09/2016

Address

MUSHEERABSD
Secunderabad
500016

Alerts

Be the first to know and let us send you an email when Computers & Education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Computers & Education:

Share