18/05/2015
తెలంగాణా భాష ను ఇంకా వాడాలె మన సర్కారుల మన పబ్లిక్ ల తెలంగాణలున్నోల్లు అందరు మాట్లాడే భాషే తెలంగాణ భాష.
ఎంత అల్కటి ముచ్చట! చెప్పుడు ఆల్కగనే కని చేసుడు ఘనం.మన భాషంత అడ్లల్ల పెరుగు గలిసినట్టు కలిగెం బులిగెం ఐపోయింది.
వాగులున్నదంత ఉస్కెనే గని అస్తర్ కార్ జెయ్యాల్నంటే కొద్దిగ జల్లెడ వట్టాలె గద.ఇగో ఇప్పుడు గా పని జెయ్యాలె.. దీనికోసం మన భాషంత ఏడ ఉన్నదో ఎనుకులాడుతే మంచిగ సమజైతది. ఈ లెక్కల పోవాలె లెక్కలు గట్టాలే మన భాషను నిలవేట్టాలే ....మన తెలంగాణా భాష మీగడోలే ఉంటది మాట్లాడంగ మాట్లాడంగ కమ్మగుంటది....
ఇండ్ల ఏమి తక్లిఫ్ ఉండదు మోసముండదు దగా ఉండదు గందుకే నేన్ తెలంగానోడిని అని గల్లెగ్రేసుకోను చెప్తా గదే జోష్ తోటి TG9FM షురూ జేస్తున్నాం జర మీరంతా కూడా మాతో నడుం బిగించండి.
https://www.facebook.com/tg9fmcom
http://www.tg9fm.com/
TG9FM ఏక్ ధమ్ తెలంగాణా
Tg9 broadcasting and media production company. We air all our programs in online website Tg9fm.com