09/03/2024
🌻 *ఇలాచేస్తే శివుఁడు మన ఇంటికి వస్తాడు , ఇలా జీవిస్తేనే...! శివుఁడు మన ఇంటికి వస్తాడు* 🌻
🌹👉సమస్త జీవుల పట్ల భూతదయతో మెలిగితే *వృషభ వాహనుడై* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉తల్లీదండ్రులను పూజిస్తూ జీవనం సాగిస్తే అమ్మ పార్వతిని
వెంట తీసుకొని *జగత్పితయై* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉గురువులను గౌరవిస్తూ మసలుకుంటే బ్రహ్మజ్ఞాన ప్రదాతయైన *శ్రీ దక్షిణామూర్తిగా* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉విడదీయలేని అన్యోన్యతతో భార్యభర్తలు కాపురం చేస్తే శివుఁడు *అర్ధనారీశ్వరుడై* మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉మనసులో ఉన్న విషపూరిత భావనలను విసర్జిస్తూ నడుస్తుంటే *నాగాభరణభూషితుడై* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉పిల్లలకు మానవత్వ విలువలను నేర్పుతూ జీవిస్తే జగజ్జననిని వెంటపెట్టుకొని *గౌరీశంకరుడై* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉ఆకలైనవారికి పట్టెడు మెతుకులను వడ్డిస్తూ ముందుకి సాగితే *శ్రీ అన్నపూర్ణాసమేతుడై* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉దాహమైన వారికి దప్పికను తీరుస్తూ ప్రయాణిస్తే *గంగాధరుడై* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉బాహ్య సౌందర్యం మీద ధ్యాస తగ్గించి మనో సౌందర్యాన్ని ఉపాసిస్తూ జీవిస్తే *శ్రీ మీనాక్షి అమ్మను వెంటపెట్టుకొని సుందరేశ్వరుడై* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉ప్రకృతిని ప్రేమిస్తూ పచ్చదనాన్ని కాపాడుతూ జీవిస్తే *శ్రీ కామక్షి అమ్మను వెంటపెట్టుకొని ఏకామ్రేశ్వరుడై* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉పరమాత్ముడిచ్చిన కన్నులను పెద్దవిగా చేసుకుని ప్రపంచంలో ఉన్న మంచిని చూస్తూ జీవిస్తే *శ్రీ విశాలక్షి అమ్మను వెంటపెట్టుకొని విశ్వనాథుడై* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉అసూయాద్వేషాలను వదిలి జీవిస్తే భళా అంటూ మెచ్చుకుని *భోళా శంకరుడై* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉తోటివారిపైన చల్లటి చూపులను వెదజల్లుతూ జీవిస్తే *కైలాస వాసుడై* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉కాలం కలిసిరాకున్నా ఖచ్చితమైన ఆత్మ విశ్వాసంతో జీవీస్తే *కాలభారవుడై* శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!
🌹👉ప్రపంచం మనల్ని చిరిగిన చీటీగా వల్లకాడులో వదిలివెళ్ళిన నాడు *రుద్రుఁడై* శివుఁడు తనలో కలుపుకుంటాడు...!!
🌷అనంతాన్ని ఆవరించిన శివుఁడు అందరి మొరను వినగలడు...!!!
🌷శివుడంటే నాగరికత, శివుడంటే జీవన విధానం, శివుడంటే సర్వం, శివుడంటేనే పర్వం...!!!
🌷 *సముద్రాన్ని ఆయనపై ఒలకబోయలేకున్నా, ఆయనపై సముద్రమంత నమ్మకాని పెట్టుకుని నాలుగు గంగనీటి తుంపరలు చల్లినా సరే సంతసిస్తాడు...!!!*
🌷శివుడు కేవలం విగ్రహంలో మాత్రమే కాదు , మన మనో నిగ్రహంలో ఉంటాడు...!!!
🌷 తాను సృష్టించిన వస్తువులను తనకివ్వడంతో శివారాధన పూర్తికాదు, మనది అనుకున్న తనదాన్ని(నేను అనే అహాన్ని) తనకివ్వడంతోనే శివారాధన పరిపూర్ణం...!!!
🌹👉 *ఇలాచేస్తే శివుఁడు మన ఇంటికి వస్తాడు , ఇలా జీవిస్తేనే శివుఁడు మన ఇంటికి వస్తాడు...!!!*
ఇంటికి రావడమేంటి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటాడు...!!!
*అప్పుడు జన్మకో శివరాత్రి కాదు, జన్మమే శివరాత్రి...!!!*
🙏🌹🌴🪔🌴🌹🙏